
పబ్ అంటే డీజే ఉంటుంది.. డాన్స్ ఉంటుంది.. మస్త్ మజా ఉంటుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఓ పబ్ అయితే అందుకు భిన్నంగా.. వైవిధ్యంగా ఆలోచించింది. ఇవన్నీ రొటీన్ అనుకున్నదో ఏమో.. పాములు, తొండలు, పిల్లులు, కుక్కలను పబ్ లో పెట్టింది. వాటితో ఆడుకోవచ్చు.. ఒంటిపై తిప్పుకోవచ్చు అంటోంది. మనుషులతో పాటు జంతువుల మధ్య కూడా మందు పార్టీ ఎంజాయ్ చేయమంటోంది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని క్సోరా నైట్ క్లబ్ ఇటీవల తమ ప్రాంగణంలో ప్రత్యక్ష విదేశీ వన్యప్రాణులను చేర్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Xora నైట్‌క్లబ్ ఈ వారాంతంలో తమ ప్రాంగణంలో అన్యదేశ వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచిందని.. దీనికి సంబంధించిన కథనాలు వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఉన్నాయని, దయచేసి చర్యలు తీసుకోండంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో కోరారు. దీన్ని ఐఏఎస్ అర్వింద్ కుమార్ రీట్వీట్ చేస్తూ.. ఈ దిగ్ర్భాంతికరమైన సంఘటనపై తెలంగాణ డీజీపీ, సీవీ ఆనంద్, తెలంగాణ పోలీస్, పీసీసీఎఫ్ చర్చిస్తున్నామని తెలిపారు.
https://twitter.com/arvindkumar_ias/status/1663206911100203008