డెస్క్​లో పని చేస్తున్నారా.. ? ఈ వార్త మీ కోసమే

డెస్క్​లో పని చేస్తున్నారా.. ? ఈ వార్త మీ కోసమే

డెస్క్ ఉద్యోగులు నిత్యం ఒకే చోట కూర్చుని పని చేయాల్సిందే. నిశ్చలంగా కూర్చోవడం పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు. ఒకే చోట కొన్ని గంటలు పని చేయడం సిగరెట్​ తాగడంతో సమానమని అది ఎంతో హానికరమంటున్నారు. తద్వారా వర్క్​లో చురుగ్గా ఉండలేమని చెబుతున్నారు.  పని వేళల్లో యాక్టివ్ గా ఉండటానికి వారు పలు సూచనలు చేస్తున్నారు.

1. తరచూ కదులుతూ ఉండండి..

పని కూర్చుని చేసేదైనా తరచూ కదులుతూ ఉండాలి. ప్రతి గంటకు ఒక సారైనా లేచి అటు ఇటు నడవండి. ఇందు కోసం అలారం ఉపయోగించండి. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కండరాల దృఢత్వాన్ని పెంచి, మనస్సును ఎల్లప్పుడూ రిఫ్రెష్​ చేస్తుంది.

2. సైకిల్​ లేదా నడక ఉత్తమం

ఇంటి నుంచి ఉద్యోగ స్థానానికి ఉన్న దూరాన్ని బట్టి సైకిల్ పై వెళ్లడం వీలైతే నడవడం ఉత్తమం. ఇది శరీరానికి వ్యాయామంగానే కాకుండా హార్ట్​ జబ్బుల వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది.

3. డెస్క్​ వద్ద చేయాల్సిందిదే..

డెస్క్​ వద్ద తీక్షణంగా కంప్యూటర్​ చూడాల్సి వస్తే తరచూ కను రెప్పలు ఆడించాలి. భుజాలు, మెడ, కాళ్లను కదుపుతూ ఉండాలి. 

4. మెట్లెక్కడం ఉత్తమం

ఎలివేటర్లు ఉన్న చోట దానికి బదులు మెట్లెక్కడం ఉత్తమమైన పని. మెట్టెక్కడం అనేది కాలు కండరాలను పటిష్టపరిచి హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇలా క్రమం తప్పకుండ చేస్తే ఫిట్​నెస్​ మెరుగుపడుతుంది.