పిల్లలకి గుడ్డు తినిపించాల్సిందే 

పిల్లలకి గుడ్డు తినిపించాల్సిందే 


పిల్లలకి ఏం తినిపించాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు తల్లులు.  ‘పలానా ఫుడ్​ పడకపోతే’ అన్న ఆలోచనతో  రెగ్యులర్​ డైట్​నే  ఎక్కువగా ఫాలో అవుతుంటారు. గుడ్లు, మాంసాల జోలికి అస్సలు వెళ్లరు. అయితే ఏడాది దాటిన పిల్లలకు  ఎంచక్కా గుడ్డు తినిపించొచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఏడాది పిల్లలకి గుడ్డు తేలిగ్గా జీర్ణమవుతుంది అంటున్నారు.  అలాగే కోడిగుడ్డులో విటమిన్– బి12, విటమిన్​–డి, యాండీ ఆక్సిడెంట్స్​ ఫుష్కలంగా  ఉంటాయి. ఇవి పిల్లల్ని ఫిట్​గా ఉంచడమే కాదు యాక్టివ్​గా చేస్తాయి.  పిల్లల బ్రెయిన్​ డెవలప్​మెంట్​కి సాయపడతాయి.  అమెరికన్​ జర్నల్​ ఆఫ్​ న్యూట్రిషియన్​  స్టడీ ప్రకారం తొమ్మిది నెలల నుంచే  పిల్లలకి గుడ్డు తినిపించొచ్చు. దానివల్ల పిల్లల్లో కాన్సన్​ట్రేషన్​ పెరుగుతుందని చెప్తోంది ఈ స్టడీ.  వాషింగ్​టన్​ యూనివర్సిటీ రీసెర్చ్​ ప్రకారం ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్య పిల్లల డైట్​లో గుడ్డు చేరిస్తే వాళ్లు త్వరగా ఎదుగుతున్నట్టు తేలింది.