గూగుల్​పే, ఫోన్​పే యూజర్లకు కోటి నష్టం

గూగుల్​పే, ఫోన్​పే యూజర్లకు కోటి నష్టం

న్యూఢిల్లీ: గూగుల్​పే, ఫోన్​పే వంటి యూపీఐ యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సైబర్​ మోసాలు పెరుగుతున్నాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. బ్యాంక్  కేవైసీ, పాన్​ స్కామ్ ద్వారా గడచిన 16 రోజుల్లో 81 మంది ముంబైవాసుల నుంచి నేరగాళ్లు రూ.కోటిని దోచుకున్నారు.  మోసగాళ్లు గూగుల్​పే లేదా ఫోన్​పే గేట్‌‌‌‌‌‌‌‌వేని ఉపయోగించి కొత్త పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందంటే... వీళ్లు గూగుల్​పే లేదా ఫోన్​పే ద్వారా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు పంపుతారు.  పొరపాటున డబ్బును పంపించామని, తిరిగి పంపించాలని బతిమాలుతారు. మనం సంబంధిత గూగుల్​పే లేదా ఫోన్​పే నంబర్‌‌‌‌‌‌‌‌కు  డబ్బును తిరిగి పంపుతాం. ఇదే సమయంలో మాల్‌‌‌‌‌‌‌‌వేర్ బారినపడతాం.  

ఢిల్లీకి చెందిన సైబర్​ ఎక్స్​పర్ట్​  పవన్ దుగ్గల్  మాట్లాడుతూ  "ఇది మాల్వేర్​తో కూడిన  మానవ ఇంజనీరింగ్ స్కామ్.  సైబర్​ క్రిమినల్స్​ గూగుల్​పే లేదా ఫోన్​పే గేట్‌‌‌‌‌‌‌‌వే ద్వారా మీ ఖాతాకు డబ్బును పంపుతారు. మీరు డబ్బును వాపసు పంపితే, మీ ఖాతా హ్యాక్ అవుతుంది" అని వివరించారు. గూగుల్​పే లేదా ఫోన్​పే యూజర్​డబ్బును తిరిగి చెల్లించినప్పుడు, మొత్తం డేటా,  పాన్​, ఆధార్​ మొదలైనవన్నీ మోసగాడికి అందుబాటులోకి వస్తాయి. ఈ డాక్యుమెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాను హ్యాక్ చేస్తారు. మాల్వేర్ ఫిషింగ్,  హ్యూమన్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఈ మోసం జరుగుతుంది కాబట్టి ఫోన్​లోని  యాంటీ-మాల్వేర్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్లు కూడా ఏమీ చేయలేవు.