వీటిని అతిగా తినొద్దు!

వీటిని అతిగా తినొద్దు!

ఎన్ని పోషకాలున్న కూరగాయలైనా అతిగా తింటే శరీరానికి అంత మంచిది కాదంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. 

  • క్యారెట్​ మంచిదని కొందరు ఎక్కువగా తింటుంటారు. వాటిలో బీటా కెరొటిన్‌‌తో పాటు వేరే న్యూట్రియెంట్స్‌‌ కూడా ఉంటాయి. ఎక్కువగా తింటే, రక్తంలో కలవకుండా, చర్మంలో కలిసిపోతాయి. దీంతో చర్మం రంగు, గోళ్లు, చేతులు ఎర్రగా మారతాయి. దీనివల్ల స్కిన్‌‌ అలర్జీలు వస్తాయి.
  • క్యాలీఫ్లవర్‌‌‌‌, బ్రొకోలిలో మంచి పోషకాలున్నప్పటికీ, ఎక్కువగా తింటే డైజషన్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. పచ్చిగా తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే ఒకరకమైన చక్కెర త్వరగా అరగదు. ఉడకబెట్టడం ద్వారానే ఇది అరుగుతుంది.
  • రక్తం పెరగడం కోసం ఎక్కువమంది తినేది బీట్‌‌రూట్‌‌. బరువు తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. జ్యూస్‌‌గా, కర్రీగా, సలాడ్‌‌గా కూడా దీన్ని తినొచ్చు. అయితే వీటిలో ఆక్సిలేట్‌‌ఉంటుంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.