బీ అలెర్ట్..కరోనాలాంటి మరో మహమ్మారి వస్తోంది

బీ అలెర్ట్..కరోనాలాంటి మరో మహమ్మారి వస్తోంది

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను  ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నాలుగేళ్లు  గడిచిపోయాయి. కరోనాతో  ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది మరణించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. అంతకుమించిన ప్రమాదం ముందుందని శాస్త్రవేత్తలు అలెర్ట్ చేస్తున్నారు.  ఏ సమయంలోనైన మరో మహమ్మారి పుట్టుకు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

స్కై న్యూస్ నివేదిక ప్రకారం.. జంతువులనుంచి మానవులకు వైరస్ వ్యాప్తి చెందే మరో మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని యూకెకు చెందిన అంటు వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి అతి సమీపంలో ఉందంటున్నారు. ఇది రెండు సంవత్సరాలు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని , అవసరమైతే త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.  

గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన  వల్ల వైరస్ లు లేదా బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

కోవిడ్ 19 జీవిత కాలంలో ఒకసారి మాత్రమే సోకే ప్రక్రియ. ఇది ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్లకు పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది.అంతకుముందు నాలుగు దశాబ్దాల క్రితం 1981లో ఇదే విధమైన మహమ్మారి HIV/AIDS  ప్రపంచాన్ని కుదిపేసింది. దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల 6 లక్షల మంది మరణించారు. దీనికి ముందు 1968లో హాంకాంగ్ ఫ్లూ మహమ్మారి సుమారు మిలియన్ మరణాలకు కారణమైంది. 1918లో స్పానిష్ ఫ్లూ తో 50 మిలియన్లు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.