దేశంలో అడవులు వాటి విస్తీర్ణం

దేశంలో అడవులు వాటి విస్తీర్ణం
  •     సతత హరిత అరణ్యాలు 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం గల ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి పశ్చిమ కనుమలు, అండమాన్​ నికోబార్ దీవులు​, ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తాయి. 50 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. 
  •     వేసవిలో భాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి తాత్కాలికంగా ఆకురాల్చే అడవుల్లోని చెట్లు ఆకులు రాల్చుతాయి. 
  •     ఆకురాల్చే అడవులకు ఉదాహరణ సాల్​ అరణ్యాలు.
  •     1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మైదానాల్లో 20 శాతం, పర్వతాలు, పీఠభూముల్లో 60 శాతం, దేశవ్యాప్తంగా 33 శాతం అడవులు ఉండాలి. 
  •     1988 రెండో జాతీయ అటవీ విధానం ప్రకారం పర్వతాలు, పీఠభూముల్లో 66శాతం, మైదానాల్లో 20శాతం, దేశవ్యాప్తంగా 33శాతం అటవీ భూములు ఉన్నాయి. 
  •     ఆలివ్​రిడ్​ తాబేళ్లకు ఉత్కల్​ తీరం ప్రసిద్ధి.
  •     ఇండియన్​ స్టేట్​ ఆఫ్​ ఫారెస్ట్ రిపోర్ట్​ – 2021 ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణం 24.62శాతం. 2019తో పోలిస్తే 2021లో అడవులు, చెట్ల  విస్తీర్ణం 0.28శాతం పెరిగింది. 
  •     దేశంలో మొత్తం 140 హిల్​ స్టేషన్లు ఉన్నాయి.
  •     దేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు వరుసగా దాద్రానగర్​ హవేలి, లడఖ్​, అండమాన్​ నికోబార్​ దీవులు, జమ్ముకశ్మీర్​.
  •     దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఒడిశా, చత్తీస్​గఢ్​, అరుణాచల్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​. 
  •     సామాజిక అడవుల పరిశోధన కేంద్రం అలహాబాద్​లో ఉంది.
  •     ఉష్ణమండల సతత హరిత అరణ్యాల పరిశోధన కేంద్రం జబల్​పూర్​లో ఉంది. 
  •     సర్వే ఆఫ్​ ఇండియా కేంద్రం ఉదయ్​పూర్​లో ఉంది. 
  •     భారతదేశంలో ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చు అడవులు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. 
  •     దేశంలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా గల రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, పశ్చిమబెంగాల్​.
  •     చిత్తడి నేలల విస్తీర్ణం అత్యధికంగా గుజరాత్​ రాష్ట్రంలో ఉంది.
  •     దేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు హర్యానా, పంజాబ్​, గోవా, సిక్కిం.
  •     కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యల్ప అటవీ విస్తీర్ణం (శాతం పరంగా) కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్​.
  •     రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం హర్యానా. 
  •     టెరాయి ప్రాంతంలో సబాయి గడ్డి, సలాయి గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. 
  •     భారతదేశంలో అత్యధికంగా ఆకురాల్చే అడవులు ఉన్నాయి. 
  •     బాబుల్​, బలుసు మాంగ్రూవ్​ జాతికి చెందినవి. 
  •     సాల్​ వృక్షాలు శృంగాకార అరణ్యాల జాతికి చెందింది.
  •     దక్షిణ భారతదేశంలో పెరిగే తేమతో కూడిన సమశీతోష్ణ అరణ్యాలను షోలా అడవులు అంటారు. 
  •     వేసవిలో ఉపయోగించే కూలర్ల తయారీలో ఉపయోగించే కుష్​ కుష్​ గడ్డి భరత్​పూర్​, గ్వాలియర్​ ప్రాంతాల్లో లభిస్తుంది. 
  •     రూసా గడ్డికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ.
  •     అగ్గిపుల్లల తయారీలో ప్యాకింగ్​ పెట్టెల తయారీలో ఫర్​ కలపను ఉపయోగిస్తారు. 
  •     క్రికెట్​ బ్యాట్ల తయారీలో విల్లోస్​ కలపను ఉపయోగిస్తారు. 
  •     హిమాద్రి పర్వత శ్రేణుల్లో ప్రధానంగా ఆల్ఫైన్​ అడవులు పెరుగుతాయి. 
  •     భారతదేశంలో మొత్తం అటవీ కార్బన్​స్టాక్​ 7125 మిలియన్​ టన్నులు.
  •     భారతదేశంలో 2021 ఇండియన్​ స్టేట్​ ఆఫ్​ ఫారెస్ట్​ నివేదిక ప్రకారం 75శాతం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం 
  • అరుణాచల్​ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, లక్షదీవులు, అండమాన్ నికోబార్​ దీవులు కలిగి ఉన్నాయి.  
  •     ఇండియన్​ స్టేట్​ ఆఫ్​ ఫారెస్ట్​ 2‌‌‌‌0‌‌‌‌21 ప్రకారం 33శాతం కంటే తక్కువ అటవీ విస్తీర్ణం 
  • కలిగి రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు 18.
  •     దేశంలోని మొత్తం మొక్కల జాతులు 9205 కాగా, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 
  •     భారతదేశంలో రిజర్వ్​ ఫారెస్ట్ 56.5శాతం.
  •     ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21.
  •     అత్యధిక లక్కను ఉత్పత్తి చేసే రాష్ట్రం జార్ఖండ్​.
  •     అత్యధికంగా టేకును ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్.
  •     భారతదేశంలో అటవీ గణన మూడేండ్లకు ఒకసారి జరుగుతుంది. 
  •     2012 భారత అటవీ నివేదిక 17వది.
  •     భారతదేశంలో తొలి అటవీ నివేదిక 1987లో ప్రచురించారు. 
  •     దేశంలో అత్యధికంగా ట్రీ కవర్​ మహారాష్ట్ర కలిగి ఉంది.
  •     దేశంలో అత్యధికంగా చెట్ల విస్తీర్ణం కలిగి కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్​.