పేషంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో దోపిడీ

పేషంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో దోపిడీ

కరోనా బారినపడి జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆస్పత్రులు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. తాజాగా అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌‌పై కేసు నమోదైంది. దాంతో హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్‌ మురళీకృష్ణను ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఏలూరుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావటంతో జూలై 23న మురళీకృష్ణ హాస్పిటల్‌లో చేర్పించారు. ఐదురోజుల తర్వాత రోగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యానికి సుమారుగా రూ.2 లక్షల వరకూ ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేసింది. కాగా.. రోగి మృతిచెందిన తరువాత కూడా ఇంజెక్షన్లు చేయాలంటూ.. మరో రూ.32,500లు వసూలు చేశారని మృతుడి కుమారుడు ఆరోపిస్తూ త్రీటౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌ పర్యవేక్షణలో ఆదివారం రాత్రి డాక్టర్‌ మురళీకృష్ణను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మురళీకృష్ణను న్యాయమూర్తి ముందు హాజరుపరిచగా.. మురళీకృష్ణకు ఈనెల 18 వరకు రిమాండ్‌ విధించారు. దాంతో మురళీకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భీమవరం సబ్‌జైలుకు తరలించారు. మురళీకృష్ణ హాస్పిటల్‌లో అనుమతులు లేకుండానే కోవిడ్‌కు చికిత్స చేయటంతో పాటు.. కొంతమంది రోగుల మరణానికి కారకులు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ఆ హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు.

For More News..

కరోనా రిపోర్ట్ కోసం మనసు చంపుకొని డాక్టర్‌తో..

రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి