స్టీలు, ఐరన్​ ఓర్​పై ఎక్స్​పోర్ట్​ డ్యూటీ తగ్గింపు

స్టీలు, ఐరన్​ ఓర్​పై ఎక్స్​పోర్ట్​ డ్యూటీ తగ్గింపు

స్టీలు, ఐరన్​ ఓర్​పై ఎక్స్​పోర్ట్​ డ్యూటీ తగ్గింపు
ఎగుమతులు పెంచేందుకే..

న్యూఢిల్లీ: స్టీల్​ ప్రొడక్ట్స్​, ఐరన్​ ఓర్​పై ఎగుమతి డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దేశీయంగా ఉక్కు పరిశ్రమకు బూస్ట్​ ఇవ్వడంతోపాటు, ఎగుమతులు పెంచుకోవడానికీ ఈ నిర్ణయం వీలు కలిగిస్తుంది. మరోవైపు ఆంధ్రసైట్​, కోకింగ్​ కోల్​, ఫెర్రోనికెల్​లపై ఇంపోర్ట్​ డ్యూటీని ప్రభుత్వం పెంచింది. ఈ మూడింటినీ  స్టీల్​ ఇండస్ట్రీ రా మెటీరియల్స్​గా వాడుతుంది. ఈ మేరకు ఫైనాన్స్​ మినిస్ట్రీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆరు నెలల గ్యాప్​ తర్వాత ఎక్స్​పోర్ట్​ డ్యూటీ కన్సెషన్స్​ను, ఇంపోర్ట్​ ట్యాక్స్​నూ రిస్టోర్​ చేశారు. శనివారం నుంచి స్పెసిఫైడ్​ పిగ్​ ఐరన్, స్టీల్​ ప్రొడక్టులతోపాటు, ఐరన్​ ఓర్​ పెల్లెట్స్​పై నిల్ డ్యూటీ ఉంటుందని ఈ ఫైనాన్స్​ మినిస్ట్రీ  నోటిఫికేషన్ వెల్లడించింది. 58 శాతం లోపు ఐరన్​ కంటెంట్​ ఉండే  ఐరన్​ ఓర్​ లంప్స్, ఫైన్స్​పైనా డ్యూటీ ఉండదని పేర్కొంది. 58 శాతానికి మించి ఐరన్​ కంటెంట్​ ఉండే లంప్స్​, ఫైన్స్​పై మాత్రం 30 శాతం ఎక్స్​పోర్ట్​ డ్యూటీ ఉంటుందని వివరించింది. ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​తో స్టీల్​ మినిస్టర్​ జ్యోతిరాదిత్య సిందియా మీటింగ్​ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ సెక్రటరీ సంజయ్​ మల్హోత్రాతో పాటు, ఇతర అధికారులూ ఈ మీటింగ్​లో పాల్గొన్నారు. ​​ ఈ డ్యూటీల తగ్గింపు కోసం స్టీల్​ ఇండస్ట్రీ గత కొన్ని నెలలుగా పట్టుపడుతోంది. తాజా నిర్ణయం​  దేశీయ స్టీల్​ ఇండస్ట్రీకి మేలు చేస్తుందని, ఎగుమతులు పెరుగుతాయని ఫైనాన్స్​ మినిస్ట్రీ తెలిపింది. ఈ నిర్ణయంపై స్టీల్​ ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేసింది.