
న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్ల వల్ల ఏర్పడుతున్న వాణిజ్యపరమైన ఇబ్బందుల నుంచి కంపెనీలను రక్షించడానికి కేంద్రం త్వరలో రూ. 2,250 కోట్ల ఖర్చుతో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ప్రారంభిస్తుందని తెలిసింది. దీనికింద కంపెనీలకు త్వరలో మద్దతు చర్యలను ప్రకటించే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.
వ్యాపారాన్ని సులభతరం చేయడం సహా వివిధ మార్గాల్లో ఎగుమతిదారులకు సాయం చేసేందుకు వారితో చర్చిస్తున్నామని వెల్లడించారు. ఈ మిషన్‌లో ఎంఎస్ఎంఈ, ఈ–-కామర్స్ ఎగుమతిదారులకు సులభంగా లోన్లు ఇవ్వడం, విదేశీ గిడ్డంగుల సౌకర్యాలు, అభివృద్ధి చెందుతున్న ఎగుమతి అవకాశాలను ఉపయోగించుకోవడానికి గ్లోబల్ బ్రాండింగ్ వంటివి ఉండొచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం మిషన్ ఏర్పాటును ప్రకటించింది.