పంటల ఉత్పత్తిలో భారత్ ముందంజ..సేంద్రీయ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం

పంటల ఉత్పత్తిలో భారత్ ముందంజ..సేంద్రీయ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని  "విస్తరణ విద్యాసంస్థ"(EEI) లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని   కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. భారతదేశం అనేక పంటల ఉత్పత్తిలో ప్రథమ శ్రేణిలో ఉందన్నారు. దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసుకునే స్థాయికి దేశం ఎదిగిందని మంత్రి వివరించారు. భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముకని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభిప్రాయపడ్డారు. 
 
మారుమూల ప్రాంతాలలో ఉండే సన్న, చిన్న కారు రైతాంగాలకి సైతం అందుబాటులోకి తీసుకురావాలని తోమర్ సూచించారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్ని అధికం చేయడానికి, నష్టాల్ని తగ్గించడానికి, మార్కెట్ అనుసంధానం చేయడానికి టెక్నాలజీలని విరివిగా వినియోగించుకోవాలన్నారు. కిందిస్థాయి రైతాంగం వరకు శిక్షణ ఇవ్వాలన్నారు. సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాలకి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుందన్నారు.   G-20 కి నాయకత్వం వహించే అవకాశం మన దేశానికి రావడం గర్వకారణం అని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.