న్యూఢిల్లీ: సావరిన్ వెల్త్ లేదా పెన్షన్ ఫండ్స్ ద్వారా స్టార్టప్‌లు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్లపై పన్ను ప్రోత్సాహకాన్ని మరో ఏడాది.. అంటే మార్చి 2025 వరకు పొడిగించాలని ప్రభుత్వం గురువారం ప్రతిపాదించింది. పన్ను మినహాయింపు మార్చి 31, 2024తో ముగుస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మినహాయింపులను మార్చి 31, 2025 వరకు పొడిగించాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.
దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, ఇప్పటివరకు 1.17 లక్షల స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించిందని ప్రకటించారు. అర్హత కలిగిన స్టార్టప్‌లు స్టార్టప్ ఇండియా కోసం యాక్షన్ ప్లాన్ కింద ఆదాయపు పన్ను ప్రయోజనాల వంటి పన్ను ప్రోత్సాహకాలను పొందవచ్చని చెప్పారు.