
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈమూవీ డిసెంబర్ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ అతిథులుగా హాజరై, సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. నితిన్ మాట్లాడుతూ ‘ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ప్రతి పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా..
మాకు అవసరమైనప్పుడు డేట్స్ ఇచ్చారు. స్పెషల్ రోల్ చేసిన రాజశేఖర్ గారికి థ్యాంక్స్. సినిమాను చూసి నా ఫ్యాన్స్, ప్రేక్షకులు అంతా కాలర్ ఎగరేస్తారని గట్టిగా నమ్ముతున్నా’ అని అన్నాడు. తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది శ్రీలీల. వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. రాజశేఖర్ గారు ఇందులో నటించాలని బలంగా కోరుకున్నా.
నా నమ్మకమే నిజమైంది. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తారు. టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ ఇచ్చారు. రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ అంతటిని కడుపుబ్బా నవ్విస్తాం’ అని అన్నాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు నిర్మాతలు. జీవిత, రాజశేఖర్‌తో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.