RRR టీంను చూస్తుంటే గర్వంగా ఉంది: రాజమౌళి

RRR టీంను చూస్తుంటే గర్వంగా ఉంది: రాజమౌళి

RRR మూవీ ఆస్కార్ తో తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS 2023) లో సంస్థలో చేరడానికి RRR నుంచి ఆరుగురు సభ్యులకు ఆహ్వానం అందింది. 

తాజాగా ట్విట్టర్ లో రాజమౌళి స్పందిస్తూ " ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం RRR టీంలోని ఆరుగురిని అకాడమీ మెంబర్లుగా ఆహ్వానించడం పట్ల చాలా గర్వంగా ఉందంటూ AMPAS ఆర్గనైజషన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న " తారక్(Tarak), చరణ్(Charan),పెద్దన్న(Peddanna), సాబు సార్ (Sabu sir), సెంథిల్ (Senthil), చంద్రబోస్(Chandrabose) కు అందరికీ అభినందనలు " అంటూ విషెష్ తెలిపారు. 

ఈ అరుదైన గౌరవం దక్కడం వెనుకాల నాటు నాటు సాంగ్ ఎంతో  స్పెషల్ రోల్ అని చెప్పుకోవాలి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో మొత్తం 398 మందికు గాను ఈ సంస్థలో చేరడానికి అవకాశం దక్కినట్లు AMPAS ప్రకటించింది. ఇటువంటి అవకాశం రావడం కేవలం ఆస్కార్ దక్కించుకుంటే రాదని వారి వారి ప్రొఫెషనల్ లో టాలెంట్ కీలకం అని తెలిపింది.