హైదరాబాద్ సరోజిని కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన ఐ పేషెంట్లు

హైదరాబాద్ సరోజిని కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన ఐ పేషెంట్లు

దీపావళి సందర్భంగా దీపకాంతులు, టపాసుల సంబరాలతో పాటో కొంత విషాదాన్ని కూడా మిగిల్చింది. ఏటా దీపాల పండగ రోజు టపాసులు కాల్చే సమయంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి ప్రమాదానికి గురై చికిత్స కోసం క్యూకట్టారు బాధితులు.. హైదరాబాద్ లోని సరోజిని కంటి ఆస్పత్రికి పేషెంట్లు క్యూ కట్టారు.దీపావళి సందర్భంగా టపాసులు పేలి ప్రమాదానికి గురై కంటి సమస్యలు తెచ్చుకున్న పేషెంట్లు సోమవారం ( నవంబర్ 13) చికిత్స కోసం వచ్చారు. 

దీపావళి సందర్భంగా హైదరాబాద్ లో టపాసులు కాల్చి పదుల సంఖ్యలో ప్రజలు ప్రమాదానికి గురై గాయపడ్డారు. చికిత్స కోసం మెహదీపట్నంలోని సరోజినీ కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. ఒక్క సరోజిని ఆస్పత్రికే దాదాపు 60 మంది బాధితులు కంటి చికిత్స కోసం వచ్చారు. పొద్దునే ఆస్పత్రి ఆవరణలో క్యూకట్టారు. 

Also Read :- శాలిబండ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో అగ్నిప్రమాదం