18 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలుడు..పట్టించిన ఫేస్ యాప్

18 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలుడు..పట్టించిన ఫేస్ యాప్

ఫేస్ యాప్ లేటెస్ట్ గా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది. ఈ యాప్ ద్వారా మనం యంగేజ్ లో ఎలా ఉన్నాం.. వోల్డేజ్ లో ఎలా ఉంటామో చూసుకోవచ్చు. అయితే 18 క్రితం తప్పిపోయిన బాలుడిని పట్టించింది ఈ యాప్ .చైనాలోని షెన్ జెన్ ఫ్రావిన్స్ లో  18 క్రితం ఓ భవన నిర్మాణ కార్మికుడి కొడుకు తప్పిపోయాడు.అప్పుడు ఆ బాలుడి వయసు మూడేళ్లు. తన కొడుకు తప్పిపోయాడని అతడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .కొన్ని రోజులు పోలీసులు వెతికారు.ఎంత వెతికినా దొరకలేదు. తర్వాత పోలీసులు కేసును మూసేశారు.తల్లిదండ్రులు కూడా కొడుకు పై ఆశలు వదులుకున్నారు

అయితే రీసెంట్ ఈ పేస్ యాప్ ను ఉపయోగించిన పోలీసులు ఆ బాలుడి ఫోటోను యాప్ లో పెట్టి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నారు. ఆ ఫోటో ద్వారా దాదాపు 100 మంది యువకులను విచారించగా బాలుడు దొరికాడు. అయితే బాలుడి  రక్త నమూనాలను అతడి తల్లిదండ్రుల డీఎన్ ఏ ను టెస్ట్ చేయగా ఒక్కటే అని తేలాయి. దీంతో ఆబాలుడి తల్లిదండ్రుల ఆనందానికి అదుపు లేకుండా పోయింది.  జన్మనిచ్చిన తండ్రి మాట్లాడుతూ.. తన బాలుడిని పెంచి పెద్ద చేసిన తండ్రి, తనకు సోదరుడి లాంటి వాడని..బాలుడికి ఇప్పటి నుంచి ఇద్దరం తండ్రులం అని అన్నాడు.