FB 2 గంటలు డౌన్.. రూ.829 కోట్లు మటాష్

FB 2 గంటలు డౌన్.. రూ.829 కోట్లు మటాష్

ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా షేర్లు నేలను చూస్తున్నాయి. ఇటీవలె మెటా యొక్క అత్యంత విలువైన ప్లాట్‌ఫాంలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌లు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. వ్యక్తిగత ఖాతాలు దాని కస్టమర్లలో చాలా మందికి  లాగ్ అవుట్ అయ్యాయి. దీంతో యూజర్లు చాలా మంది ఎక్స్ లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యాప్స్ పని చేయని సమయంలో అమెరికా మార్కెట్లు ట్రేడింగ్‌లో కొనసాగుతున్నాయి. ఇది మెటా షేర్లపై  ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. 

కంపెనీ షేర్లు 1.60 శాతం క్షీణించాయి. మార్క్ జుకర్‌బర్గ్ సుమారు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు కోల్పోయారు. ఇండియన్ రూపాయిలో చూస్తే రూ.829 కోట్లకు సమానం. ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌, థ్రెడ్‌లతో పాటు, వాట్సాప్ కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు మెటా సంస్థ తెలిపింది. మెటా రన్ ప్లాట్‌ఫాంలపై అంతరాయం ఏర్పడటంతో ఇదే మొదటిసారి కాదు. ముఖ్యంగా 2022లో మెటా షేర్లు దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే.