అవాక్కయిన FB నెటిజన్లు : లోగో చూశారా.. బ్లూ కలర్ డార్క్ అయ్యింది..

అవాక్కయిన FB నెటిజన్లు : లోగో చూశారా.. బ్లూ కలర్ డార్క్ అయ్యింది..

ఫేస్ బుక్.. తెలియనోళ్లు.. వాడనోళ్లు ఎవరూ ఉండకపోవచ్చు.. ఇక ఫేస్ బుక్ అంటే f అక్షరం వైట్ లో ఉండి.. చుట్టూ బ్లూ కలర్ ఉంటుంది. అది లైట్ బ్లూ.. ఇప్పుడు ఫేస్ బుక్ రంగు మారింది. డార్క్ బ్లూలోకి మారింది. బ్రెయిట్ నెస్ పెరిగింది. ఈ మార్పును సడెన్ గా చూసిన నెటిజన్లు.. ఫేస్ బుక్ డూప్లికేటా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరి కొందరు అయితే కళ్లు రుద్దుకుని చూశారు.. ఏంటీ చూపు మరీ ఎక్కువగా ఉంది అన్నట్లు.. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఒకే రంగు, ఒకే లోగోతో ఉంది కదా.. ఒక్కసారిగా మరింత వెలుగుగా.. బ్రయిట్ నెస్ గా ఉండటం చాలా మందికి అనుమానాలు వచ్చాయి. కొందరు అయితే ఈ అకౌంట్ నాదేనా అని చెక్ చేసుకున్నారు.

ALSO READ: YouTube : 18 నుంచి 44 యేళ్ల లోపు వారి ఛాయిస్ షార్ట్స్

ఇంతకీ విషయం ఏంటంటే.. ఫేస్ బుక్ తన లోగోలో ఉండే బ్లూ కలర్ ను.. బ్రయిట్ చేసింది. పాత లోగోలో లైట్ బ్లూ ఉండగా.. ఇప్పుడు కొంచెం వెలుగులు దిద్దింది. ఈ మార్పుపై ముందస్తు సమాచారం లేకపోవటం.. నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. తీరిగ్గా విషయం తెలుసుకుని కూల్ అయ్యారు.

ఉదయం అకౌంట్ ఓపెన్ చేయగానే.. ఫేస్ బుక్ లోగో మరింత బ్రయిట్ నెస్ గా కనిపించటం విశేషం. ఒక్క లోగోనే కాకుండా హోంబటన్, ఫ్రెండ్స్, వీడియోలు, గ్రూప్స్ వంటి ఐకాన్ బటన్స్ సైతం మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. రంగులు మారలేదు కానీ.. ఉన్న రంగునే ఫాలిష్ చేసినట్లు ఉంది. మొత్తానికి ఒక్కసారిగా ఫేస్ బుక్ అందర్నీ అయోమయానికి గురి చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.