ఫేస్‌బుక్ యూజర్లూ బీకేర్ఫుల్:మెటా AI ఫోటోలను డీప్​ స్కాన్​ చేస్తుంది

ఫేస్‌బుక్ యూజర్లూ బీకేర్ఫుల్:మెటా AI  ఫోటోలను డీప్​ స్కాన్​ చేస్తుంది

మెటాఫ్యామిలీ యాప్స్​ వాడుతున్నారా..పేస్ బుక్​, ఇన్ స్టాగ్రామ్​లను వినియోగిస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే.. మెటా ఇటీవల కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఇది మీ ఫోన్లో ఫొటోలను మీరు అప్లోడ్​ చేయకపోయిన  మీ ఫోన్ కెమెరా రోల్‌లోని ఫోటోలను AI శిక్షణకోసం వినియోగిస్తుందట..ఇది మీ ప్రైవసీకి భంగం కలిగించొచ్చు. 

మెటా(ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ) ఇటీవల ఓ కొత్త "క్లౌడ్ ప్రాసెసింగ్" ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. మీరు Facebook లేదా ఇతర మెటా యాప్‌లలో స్టోరీని క్రియేట్​ చేస్తున్నపుడు మీకు "క్లౌడ్ ప్రాసెసింగ్"కు ఆప్ట్-ఇన్ చేయమని అడుగుతూ ఓ పాప్-అప్ కనిపిస్తుంది. మీరు అంగీకరిస్తే ఫోన్ కెమెరా రోల్‌లోని ఫోటోలను మెటా సర్వర్‌లకు అప్‌లోడ్ చేస్తుంది. AI ద్వారా వాటిని విశ్లేషిస్తుంది. 
ఇంతకు ముందు మెటా AI శిక్షణ కోసం పబ్లిక్‌గా షేర్ చేసిన ఫోటోలను మాత్రమే ఉపయోగించేది. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు పబ్లిక్‌గా షేర్ చేయని, మీ ప్రైవేట్‌ ఫోటోలను కూడా స్కాన్ చేస్తుంది. 

మెటా AI మీ ఫోటోలలోని ముఖాలు, వస్తువులు, ప్లేసెస్​,వాటి మెటాడేటా వంటి వివరాలను విశ్లేషిస్తుంది. ఇది మీకు కొల్లాజ్‌లు, రీక్యాప్‌లు లేదా AI-ఎడిట్ చేసిన ఫోటోలు వంటి సూచనలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని మెటా సంస్థ చెబుతోంది. 

మీరు ఈ ఫీచర్‌కు అంగీకరించినప్పుడు మెటా AI నిబంధనలను కూడా అంగీకరిస్తారు. ఈ నిబంధనలు మెటా మీ ఫోటోలను విశ్లేషించడానికి, వాటి కంటెంట్‌ను కలెక్ట్​ చేసేందుకు, వాటిని ఎడిట్​ చేసేందుకు, మీ వ్యక్తి సమాచారాన్ని స్టోర్​ చేసేందుకు, వినియోగించేందుకు అనమతించినట్లేఅవుతుంది.

జాగ్రత్తగా ఉండాలి..

మీరు ఒకసారి ఆప్ట్-ఇన్ చేస్తే మెటా మీ కెమెరా రోల్‌కు నిరంతర యాక్సెస్ పొందుతుంది. మీ ఫోటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసి విశ్లేషిస్తుంది. ఇది మీ అత్యంత వ్యక్తిగత డేటాలో ఒకటైన మీ ప్రైవేట్ ఫోటోలకు కంపెనీకి లోతైన యాక్సెస్‌ను ఇస్తుంది. మీ ఫోటోలలో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ,మీరు రహస్యంగా ఉంచాలనుకునే ఇతర వివరాలు ఉండవచ్చు.
వ్యక్తిగత సమాచారం అంటే ఏమిటో మెటా స్పష్టంగా నిర్వచించలేదు..ఇది కస్టమర్లకు వారి అనుమతికి లిమిట్​ ను అర్థం చేసుకోవడం కష్టతరం చేస్తుంది.

మీ ఫోటోలను స్కాన్ చేయకుండా Meta AI ని ఎలా నిరోధించాలి:

పాప్-అప్‌లను జాగ్రత్తగా చదవాలి. ఏదైనా కొత్త ఫీచర్ కోసం పాప్-అప్ వచ్చినప్పుడు, వాటిని క్షుణ్ణంగా చదవండి. ఈ "క్లౌడ్ ప్రాసెసింగ్" ఫీచర్ ఆప్ట్-ఇన్ ప్రాతిపదికన పనిచేస్తుంది.అంటే మీరు ఒప్పుకుంటే ప్రాసెస్​ అవుతుంది. మీరు ఇప్పటికే క్లౌడ్​ ప్రాసెసింగ్​ ఫీచర్​యాక్సెప్ట్​ చేస్తే Facebook యాప్ సెట్టింగ్‌లలో Preferences విభాగంలో Camera Roll Sharing Suggestions ద్వారా ఈ ఫీచర్‌ను నిలిపివేయవచ్చు. రెండు కెమెరా రోల్ ఆధారంగా సూచనలు చేసేందుకు,AI-ఎడిట్ చేసిన వెర్షన్‌లను చేసేందుకు రెండు ఆప్షన్లు ఉంటాయి. వీటిని రెండింటినీ నిలిపివేయవచ్చు.

మెటా తన AI సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కస్టమర్లు డేటా ప్రైవసీకి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. అందువల్ల మీ ఫోటోలకు యాక్సెస్‌ను అనుమతించే ముందు నిబంధనలను అర్థం చేసుకోవడం, మీ ప్రైవసీ సెట్టింగ్‌లను తరచుగా చెక్​ చేయడం చాలా అవసరం.