
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది సోషల్ మీడియా యూజర్స్... ఫలితాలు వెలువడిన తర్వాత కర్ణాటకలో వేర్పాటువాద ఇస్లాంలు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. "కాంగ్రెస్ విజయం తరువాత, రాజకీయ ఇస్లాం మళ్లీ వేర్పాటువాద స్వరాన్ని పెంచడం ప్రారంభించింది. నిన్న కర్ణాటకలో అలాంటి ర్యాలీ జరిగింది. ఈ చర్యలపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఆలస్యం చేయకూడదు" అని ఫేస్‌బుక్‌లో వీడియోను షేర్ చేసిన ఓ యూజర్.. మలయాళంలో రాసుకొచ్చారు.
ఈ వీడియోపై నిజ నిర్థారణ కోసం తనిఖీ చేసిన ఫ్యాక్ట్ చెక్.. ఈ వీడియోపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ర్యాలీలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ధరించిన ఎరుపు, ఆకుపచ్చ రంగు టోపీలపై ఐఎస్ఎఫ్ అనే అక్షరాలు ఉన్నాయి. ఈ లెటర్స్ ను గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఉర్దూలో ఒక ట్వీట్ కనిపించిందని, ముహమ్మద్ తాహిర్ మియో ఈ పోస్ట్ చేశారని వెల్లడించింది. దాంతో పాటు ఈ ట్వీట్ లో "పాకిస్తాన్ ప్రజలు శక్తివంతమైన వ్యక్తులు.. మీరు ఓడిపోయారు! ప్రజలు గెలిచారు!" అని రాసుకొచ్చారు. మే 11న ఈ ట్వీట్ చేసినట్టు గుర్తించిన ఫ్యాక్ట్ చెక్.. #PakistanUnderFacism అనే హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ఉన్నట్టు గుర్తించింది. వీటితో పాటు #ఇమ్రాన్ ఖాన్, #బిహైండ్ యు స్కిప్పర్, #ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అనే ట్యాగ్స్ ఉండడంతో ఇది దక్షిణాది రాష్ట్రం కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ర్యాలీ జరగలేదని ఇది ధృవీకరించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని అమీర్ ఖాన్ అరెస్ట్ సమయంలో ఇది జరిగినట్టు వెల్లడించింది.
https://twitter.com/AnwarLodhi/status/1656410302626295814