Aavesham BoxOffice: సూపర్ ఎంటర్ టైనింగ్గా ఫాఫా ఆవేశం..హైదరాబాద్‌లోనూ 94 శాతం ఆక్యుపెన్సీ

Aavesham BoxOffice: సూపర్ ఎంటర్ టైనింగ్గా ఫాఫా ఆవేశం..హైదరాబాద్‌లోనూ 94 శాతం ఆక్యుపెన్సీ

పుష్ప సినిమాతో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil)  నేషనల్ వైడ్గా మరింత ఫేమస్ అయ్యాడు.విభిన్నమైన పాత్రలు పోషిస్తూ..తనదైన నటనతో ప్రేక్షకుల మనస్సులో ఫహద్ ఫాజిల్ సినిమాలతో..ఒక సిగ్నేచర్ మూమెంట్ని క్రియేట్ చేశాడు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు.   

రోమాంచం’ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఆవేశం(Aavesham) మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో లోకల్ గ్యాంగ్‍స్టర్ రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ తన మెస్మరైజింగ్ యాక్టింగ్తో..ఆయనలోని నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా మలయాళంలో వచ్చిన ఇంట్రెస్ట్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు.

అంతేకాదు తెలుగులోనూ బాక్సాఫీస్ వేటలో ఉరకలు వేస్తోంది. అలాగే ఈ మూవీకి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ దుమ్మురేపుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మలయాళంలో ఆవేశం డే 1 కలెక్షన్స్

ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ తో షురూ అయిన  ఆవేశం మూవీ ఇండియా వైడ్గా రూ.3.8కోట్లు వసూళ్లు రాబట్టింది.గురువారం మొత్తంలో  మలయాళ థియేటర్స్ లో 73.57 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉన్నట్లు చెబుతున్నాయి. ఇందులో మార్నింగ్ షోలకు 62.97 శాతం, మధ్యాహ్నం షోలకు 73.67 శాతం, సాయంత్రం షోలకు 78.85 శాతం, ఇక రాత్రి షోలకు 78.78 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది.

అంతేకాదు హైదరాబాద్‌లోనూ క్రేజ్ ఈ మూవీ 94 శాతం ఆక్యుపెన్సీతో రికార్డు క్రియేట్ చేస్తోంది. దీంతో తెలుగు థియేటర్స్ లో మలయాళ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే..పుష్ప విలన్ క్రేజ్ అని బన్నీ ఫ్యాన్స్ ఖుషి అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.  కాగా ఈ సినిమాను అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్, ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా నిర్మించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం..ఆవేశం మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత..అంటే 40 రోజులలో ఓటీటీకి వచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.