బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఫెయిల్ .. మహిళా పైలట్ 3 నెలలు సస్పెండ్!

బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఫెయిల్ ..  మహిళా పైలట్ 3 నెలలు సస్పెండ్!

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ మహిళా పైలట్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విమానం బయల్దేరడానికి ముందు చేపట్టిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్​లో ఫెయిల్​అవడంతో ఆ పైలట్ ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్టు మంగళవారం ఎయిర్ ఇండియా ఆఫీసర్ ఒకరు తెలిపారు. బోయింగ్ 787 విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఓ మహిళా పైలట్, గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానంలో ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్​లో ఫెయిల్​అయ్యారు. 

దీంతో సంస్థ ఆమెపై చర్యలు చేపట్టింది. సస్పెండ్ అయిన లేడీ పైలట్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అని సమాచారం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్​రూల్స్ ప్రకారం, ఫ్లైట్​సిబ్బంది తప్పనిసరిగా ఫ్లైట్ డ్యూటీ బయలుదేరే విమానాశ్రయంలో ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ టెస్ట్​లో ఫెయిల్ అయితే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇలాంటివి రిపీట్​అయితే సివియర్ యాక్షన్ తీసుకుంటారు. విమాన ప్రయాణానికి ముందు, తరువాత టెస్ట్​లకు ఇది వర్తిస్తుంది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మొదటిసారి విఫలమైన పైలట్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.