యువతిని మోసం చేసిన నకిలీ బాబా

V6 Velugu Posted on Sep 06, 2021

మాయ మాటలతో దొంగ బాబా యువతిని మోసం చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది.  ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష పాస్ చేయిస్తానని విశ్వజిత్ జా అనే నకిలీ బాబా ఓ యువతికి మాయమాటలు చెప్పాడు. ఆమె నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా రూ. 80 వేలు తన ఎకౌంట్‌ లో జమ చేయించుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సంప్రదించేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాబా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నకిలీ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Tagged Hyderabad, cheated, Young woman, fake baba,

Latest Videos

Subscribe Now

More News