టీమిండియా ఫుడ్‌‌ మెనూలో హలాల్ మాంసం?

టీమిండియా ఫుడ్‌‌ మెనూలో హలాల్ మాంసం?

కాన్పూర్‌‌: న్యూజిలాండ్‌‌తో ఫస్ట్‌‌ టెస్ట్‌‌ కోసం కాన్పూర్‌‌ వచ్చిన టీమిండియా క్రికెటర్లకు అందించే ఫుడ్‌‌పై  పలువురు విమర్శలు చేస్తున్నారు. టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌..  కేటరింగ్‌‌ వాళ్లకు పంపిన ఫుడ్‌‌ మెనూ లిస్ట్‌‌లో చేసిన కొన్ని సూచనలే ఇందుకు కారణం. ఇండియా టీమ్‌‌కు అందించే ఫుడ్‌‌లో ఎలాంటి రూపంలోనైనా సరే  బీఫ్‌‌, పొర్క్‌‌ కలవకూడదని, హలాల్‌‌ చేసిన మాంసం మాత్రమే అందించాలని మేనేజ్‌‌మెంట్‌‌ ప్రత్యేకంగా పేర్కొంది. ఇందులోని  హలాల్‌‌ మాంసం విషయంలో సోషల్‌‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

బీసీసీఐ హలాల్​ మీట్​ను ప్రమోట్​ చేస్తోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే విత్​డ్రా చేసుకోవాలని డిమాండ్​ చేస్తున్నాయి. మరోపక్క కివీస్‌‌ క్రికెటర్లు ఫస్ట్‌‌ టెస్ట్‌‌ లంచ్‌‌ బ్రేక్‌‌ కోసం ప్రత్యేక మెనూ ఆర్డర్‌‌ చేశారు. రెడ్‌‌ మీట్‌‌, వైట్‌‌ మీట్‌‌, కార్బోహైడ్రేట్స్‌‌ ఉండే ఫుడ్​, రెండు రకాల కూరగాయలు,  ఫ్రూట్​తో కలిపి ఒక సలాడ్‌‌ తమ లంచ్‌‌లో ఉండాలని సూచించారు. కాగా, ఫుడ్ మెనూపై వస్తున్న విమర్శలను బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ప్లేయర్లు, టీమ్ స్టాఫ్ ఫలానా ఫుడ్ తినాలని బోర్డు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఆటగాళ్లు తమకు నచ్చిన ఫుడ్ ను ఎంపిక చేసుకుని తినే స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు.