V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: V6 న్యూస్  ఛానెల్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. వీ6 న్యూస్ చేయని ప్రసారాలను చేసినట్లు స్క్రీన్ షాట్లు సృష్టించి… వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతల నుండి బండి సంజయ్ ను బీజేపీ తప్పించినట్లు తప్పుడు కథనాలతో స్క్రీన్ షాట్లు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు..  అలాగే బండి సంజయ్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీ6 చేయని ప్రసారాలను.. చేసినట్లుగా ఫేక్ సృష్టించారు.   గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం ఉద్దేశ పూర్వకంగా వీ6 లోగో ఉపయోగిస్తూ.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లు V6 న్యూస్ టీమ్ గుర్తించింది.  వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది v6 టీమ్.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ… సర్క్యులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని V6 న్యూస్ టీమ్ కోరింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్ షార్ట్స్ URL links ని ఫిర్యాదుతో జత చేసి ఆధారాలతో సహా V6 టీమ్ ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు వీ6 కంప్లయింట్ యథాతథంగా…

TO
Additional Dcp,
Cyber Crimes,
Hyderabad.

Subject- V6 న్యూస్ ప్రసారం చేయని కథనాలను మార్ఫింగ్ తో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్న వారిపై చర్య తీసుకోవడం గురించి.
Respected Sir ,
GHMC ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించినట్లు, ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించినట్లు V6 NEWS ఛానల్ బ్రేకింగ్ న్యూస్ నడిపినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ తో స్క్రీన్ షాట్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్ పై అగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా టెలికాస్ట్ చేయని వార్తను చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. పైన పేర్కొన్న వార్త కథనాలపై V6 NEWS లైవ్ లో చెప్పినట్లుగా స్క్రీన్ షాట్ ను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విషయమై V6 NEWS ఎటువంటి వార్త కథనాన్ని ప్రసారం చేయలేదు, V6 NEWS ఎటువంటి లైవ్ ఇవ్వలేదు, ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ . ఇది రాబోయే GHMC ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం కాబట్టి , ఈ ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేసినవారు,సర్క్యూలేట్ చేసినవారిని తక్షణమే గుర్తించి తగిన చర్యలు తీసుకోగలరని మనవి.
Regards
KVN Kishore,
CTO,
V6 NEWS,
MLA COLONY,
BANJARA HILLS,

FOR More News…

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?

వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్