బీసీ హాస్టల్‍లో విద్యార్థి మృతి.. వార్డెన్ సస్పెండ్

బీసీ హాస్టల్‍లో  విద్యార్థి మృతి.. వార్డెన్ సస్పెండ్

కామారెడ్డి జిల్లాలోని బిర్కూర్ బీసీ బాలుర హాస్టల్ లో సాయిరాజ్ అనే విద్యార్థి చనిపోయాడు. దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బిర్కూర్ బీసీ హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో సాయిరాజ్ కు వాంతులు అవడంతో హాస్పిటల్ కు తరలించారు. ఉదయం 5 గంటలకు సాయిరాజ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పాము కరిచిందని హాస్టల్ సిబ్బంది తెలిపారని సాయిరాజ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతిపై వివిధ రకాల కారణాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ హాస్టల్ కు చేరుకున్న సాయిరాజ్ కుటుంబ సభ్యులు.... హాస్టల్ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీసీ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక విద్యార్థి మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

బిర్కూర్ బీసీ బాలుర వసతిగృహంలో విద్యార్థి మృతి చెందడంతో వార్డెన్ సందీప్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ తెలిపారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి మృతిచెందినందున అతడిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విద్యార్థి సాయి రాజ్ మృతిపై ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.