ఆదిలాబాద్ జిల్లాలోని ఒక జీపీలో అత్తా కోడళ్ల పోటీ

ఆదిలాబాద్ జిల్లాలోని ఒక జీపీలో అత్తా కోడళ్ల పోటీ
  • ఫ్యామిలీ ‘పంచాయితీ’.
  • .ఆదిలాబాద్​ జిల్లాలోని ఒక జీపీలో అత్తా కోడళ్ల పోటీ
  • మరోచోట  అన్నదమ్ములు

ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో ఒకే ఫ్యామిలీ నుంచి సర్పంచ్​ స్థానం కోసం పోటీపడడం చర్చనీయాంశంగా మారింది. ఓ జీపీలో ముగ్గురు సొంత అన్నదమ్ములు సర్పంచ్  పోటీకి సై అంటుండగా, మరో చోట అత్త, కోడలు పోటీ పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట గ్రామ సర్పంచ్​ స్థానానికి జాదవ్  కుబేర్  సింగ్, లఖన్,  అనార్  సింగ్  నామినేషన్లు దాఖలు చేశారు.

 ఇందులో జాదవ్  లఖన్  గత టర్మ్​లో సర్పంచ్ గా పని చేశాడు. ఇదే మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన తొడసం లక్ష్మీబాయి, ఆమె కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్  పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య జీపీ ఎలక్షన్లు పంచాయితీ పెట్టాయని చర్చించుకుంటున్నారు.