ఫ్యామిలీ స్టార్ మూవీ షూట్ కంప్లీట్

ఫ్యామిలీ స్టార్ మూవీ షూట్ కంప్లీట్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. సమ్మర్ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏప్రిల్ 5న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ మూవీ మొత్తం షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయినట్టు శనివారం అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా  ఫారిన్ లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయ్, మృణాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరశురామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టీమ్ అంతా కలిసున్న ఫొటోను షేర్ చేశారు. 

అలాగే ఒకరినొకరు కౌగిలించుకున్న వీడియోను రిలీజ్ చేసి తమ షూట్ కంప్లీట్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు.  ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, త్వరలోనే ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నామని తెలియజేశారు. ఇందులో  విజయ్ మిడిల్ క్లాస్  ఫ్యామిలీమేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా కనిపించనున్నాడు.  దివ్యాన్ష కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.  దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.