
తన భార్యను 'అత్యంత అందమైన మహిళ'అని పేర్కొన్న ఫ్యాన్ కామెంట్ పై టెన్నిస్ ఆటగాడు బోపన్న స్పందించాడు. దానికి తాను కూడా అంగీకరిస్తున్నానంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం బోపన్నపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్లు రోహన్ బోపన్న, సానియా మీర్జా ఓడిపోయారు. రాడ్ లావర్ ఎరీనాలో బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ మాటోస్, లూయిసా స్టెఫానీ జోడీ బోపన్న-సానియా జోడీని వరుస సెట్లలో (6-7, 2-6) ఓడించింది. ఆ గేమ్‌తో సానియా గ్రాండ్‌స్లామ్ కెరీర్ కూడా ముగిసింది. సానియా మ్యాచ్ కోసం ఆమె కుమారుడు ఇజాన్‌తో సహా ఆమె కుటుంబం కూడా మెల్‌బోర్న్ చేరుకోగా... బోపన్న భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు.
అయితే బోపన్న గేమ్ లో ఉండగా.. అక్కడున్న తన భార్య సంబంధించిన ఓ ఈ విషయాన్ని అభిమాని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. 'బోపన్న భార్య అత్యంత అందమైన మహిళ. అంతటి అందమైన మహిళను ఎప్పుడూ చూడలేదు.' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారడంతో.. దీనిపై టెన్నిస్ ప్లేయర్ బోపన్న కూడా రియాక్ట్ అయ్యాడు. ఫ్యాన్ కామెంటుకు రిప్లై ఇస్తూ..'నేను అంగీకరిస్తున్నాను' అని సమాధానమిచ్చాడు.