
నవాజుద్దీన్ సిద్ధిఖీ.. బాలీవుడ్లో ఆయన పోషించిన విభిన్న పాత్రలు ఎన్నో. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఆయన సరికొత్త లుక్ తో థ్రిల్ చేయనున్నారు. గతంలో ఎన్నడూ చూడని పాత్రలో కన్పించబోతున్నారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా నటిస్తున్న మూవీ హడ్డీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆయన లేడీ గెటప్ లో కన్పించనున్నారు. అతని మేకోవర్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు కపిల్ శర్మ షోలోని అర్చన పురాణ్ సింగ్ తో పోలుస్తున్నారు. అర్చన పురాణ్ సింగ్ బయోపిక్ ను తీస్తున్నారా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కామెంట్స్ పై అర్చన స్పందించారు. తనను నవాజుద్దీన్ సిద్దిఖీతో పోల్చడం గొప్ప అభినందనలాగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘నా హెయిర్ స్టైల్ ఈ పోలికలకు కారణమైంది. ది కపిల్ శర్మ షోలో మొదట్లో ఇటువంటి స్టైల్ ఉపయోగించాను. ఏ విధంగానైనా నవాజుద్దీన్ తో పోల్చడం గొప్ప అభినందనగా భావిస్తున్నా’’ అని చెప్పారు.