Cricket World Cup 2023: ఉప్పల్ స్టేడియంలో సౌండ్ లేదు.. మరీ తక్కువగా ప్రేక్షకులు

Cricket World Cup 2023: ఉప్పల్ స్టేడియంలో సౌండ్ లేదు.. మరీ తక్కువగా ప్రేక్షకులు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 2023, అక్టోబర్ 6వ తేదీ పాకిస్తాన్.. నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అయితే.. స్టేడియంలో ప్రేక్షకులు అస్సలు లేరు. వరల్డ్ కప్ టోర్నీ జోష్ కనిపించలేదు. ప్రేక్షకులు అస్సలు లేకపోవటంతో.. వెలితిగా అనిపించింది. ఉప్పల్ స్టేడియం సీట్ల సామర్థ్యం 50 వేల మంది అయితే.. స్టేడియంలో మూడు, నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు. 

మ్యాచ్ ఆడో జట్లు ఏవైనా సరే.. క్రికెట్ మ్యాచ్ అనగానే హైదరాబాదీలు ఎగబడిపోతారు. ఐపీఎల్ టోర్నీలకు సైతం టికెట్లు కోసం కొట్టుకున్నారు.. అలాంటిది ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే కనీసం మూడు, నాలుగు వేల మంది మాత్రమే రావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎండ తీవ్రత, ఆఫీసులు ఉండటం వల్లే ప్రేక్షకుల సంఖ్య మరీ తక్కువగా ఉందనే వాదన ఉంది. 

నిన్నటికి నిన్న అహ్మదాబాద్ ఫస్ట్ మ్యాచ్ లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అయితే సాయంత్రం ఆరు గంటలకు 40 వేల మంది వరకు హాజరయ్యారు. ఉప్పల్ మ్యాచ్ లోనూ సాయంత్రానికి అయినా అభిమానులు వస్తారా లేదా అనేది చూడాలి..