విరాట్ కెప్టెన్‌గా ఉండటం టీమిండియా అదృష్టం

విరాట్ కెప్టెన్‌గా ఉండటం టీమిండియా అదృష్టం

వరల్డ్ టెస్ట్ సిరీస్‌ ఫైనల్‌లో ఓటమితో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించడంలో తరచూ విఫలమవుతుండటంతో కోహ్లీపై ఫ్యాన్స్‌తోపాటు మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. అయితే ఇంగ్లీష్ క్రికెటర్ పీటర్ ట్రెగో మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. విరాట్ లాంటి సారథి ఉండటం టీమిండియా అదృష్టమన్నాడు. 

‘కోహ్లీ వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉంది. భారత జట్టు కూడా స్థిరంగా, నిలకడగా రాణిస్తోంది. ఒత్తిడితో తాను రాణించడంతోపాటు జట్టును నడిపించడంలో విరాట్ సక్సెస్ అవుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ లాంటి జట్టును నడిపించడం కంటే ఎక్కువ ఒత్తిడి ఎందులోనూ ఉండదని నా అభిప్రాయం. ఈ పనిని కోహ్లీ చక్కగా నెరవేర్చుతున్నాడు. విమర్శకులు దీని గురించి ఆలోచించాలి. అతడి లాంటి కెప్టెన్ ఉండటం జట్టుకు వరమని ఫ్యాన్స్, క్రిటిక్స్ అర్థం చేసుకోవాలి. అధికారికంగా చూస్కుంటే భారత్ ప్రపంచంలోని బెస్ట్ టీమ్స్‌లో రెండో స్థానంలో ఉంది. ఎవరైనా నంబర్ వన్‌గా ఉండాలనే అనుకుంటారు. కానీ అది అన్ని వేళలా సాధ్యపడదు’ అని ట్రెగో పేర్కొన్నాడు.