
న్యూఢిల్లీ: రీబూట్ అనే మార్కెటింగ్ఏజెన్సీ గూగుల్ సెర్చ్‌ల ఆధారంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో 2023 సంవత్సరానికి గాను సెక్సీయెస్ట్ బాల్డ్ (బట్టతల) మ్యాన్’గా బ్రిటన్ యువరాజు విలియం నిలిచారు. మొత్తం 10 పాయింట్లకు గాను ప్రిన్స్ విలియం 9.88 స్కోర్‌తో అగ్రస్థానం పొందారు. ఆయనకు వోకల్ అట్రాక్టివ్నెస్లో 9.91, షైనింగ్ లో 8.90 పాయింట్లు వచ్చాయి. ఏడాది కాలంలో ఆయనకు సంబంధించి 37,200 సెర్చ్‌లు వచ్చాయి. గతేడాది విజేతగా నిలిచిన హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ ఈసారి మూడో స్థానంలో నిలిచారు. మరో హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ రెండవ స్థానంలో, శామ్యూల్ ఎల్ జాక్సన్ నాల్గవ స్థానంలో, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఐదవ స్థానంలో నిలిచారు.