ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పనున్న ధోని.. హింట్ రూపంలో CSK ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పనున్న ధోని.. హింట్ రూపంలో CSK ఎమోషనల్ పోస్ట్

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తప్పుకోనున్నాడనే వార్తలు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అందుకు చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ హ్యాండిల్.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియోనే కారణం. 'ఓ కెప్టెన్.. మై కెప్టెన్' అంటూ సీఎస్‌కే  ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు రిటైర్మెంట్‌పై ధోనీ తుది నిర్ణయం తీసుకున్నట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్లు అర్థం వచ్చేట్లు ఈ వీడియో ఉంది.

2023 సీజన్ తరువాత ధోని తప్పుకోనున్నాడనే వార్తలొచ్చినప్పటికీ అతడు అలాంటి ప్రకటనేమీ చేయలేదు. పైగా వచ్చే సీజన్‌లోనూ ఆడాలనుకుంటున్నా అంటూ బాంబ్ పేల్చాడు. "వచ్చే సీజన్‌లో ఆడాలనే అనుకుంటున్నా. సీఎస్‌కే అభిమానులకు నేనిచ్చే బహుమతి ఇదే. అయితే అందుకు నా శరీరం సహకరిస్తుందో లేదో తెలీదు. దానికి ఇంకా 7-8 నెలల సమయం ఉంది. తీరిగ్గా నిర్ణయం తీసుకుంటా.." అంటూ కెప్టెన్ కూల్ చాలా స్పష్టంగా చెప్పాడు.

అయితే గత సీజన్‌లో ధోని మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్‌లోనూ సపోర్టర్ సాయంతో మైదానంలోకి దిగాడు. ప్రస్తుతానికి మోకాలి శస్త్ర చికిత్స విజయవంతమైనప్పటికీ.. అతడు తిరిగి మైదానంలోకి దిగడం కష్టమే అంటున్నారు.. విశ్లేషకులు. ప్రస్తుతం ధోని వయస్సు 41. వచ్చే నెలలో 42లో అడుగు పెట్టనున్నాడు. ఈ సమయంలో అతడు రిస్క్ చేయకపోవచ్చని అంటున్నారు.

Oh Captain, My Captain! ?#WhistlePodu #Yellove ?? @msdhoni pic.twitter.com/whJeUjWUVd

— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023

నో గార్డ్ ఆఫ్ హోనర్.. 

ధోనీకి మిగిలిన క్రికెటర్లలా ఆఖరి మ్యాచ్ అనుభూతి, చివరి క్షణాల్లో గార్డ్ ఆఫ్ హోనర్ తీసుకుంటూ ఎమోషనల్ అవ్వడం వంటివి పెద్దగా ఇష్టం ఉండదు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోనీ.. లాక్‌డౌన్ సమయంలో ఆగస్ట్ 15, 2020న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ విషయంలో కూడా ధోనీ ఇలాగే నడుచుకోవచ్చనే వార్తలొస్తున్నాయి.