
‘జాతిరత్నాలు’ చిత్రంలోని చిట్టి పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిట్టి పేరుతోనే ఎక్కువ గుర్తింపును అందుకుంది. తాజాగా ఈ హైదరాబాద్ అమ్మాయి ఓ హిందీ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేసింది. ‘ది జెంగబూరు కర్స్’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీల మాధవ్ పాండ దర్శకుడు.
లండన్‌లో ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ అయిన ప్రియంవద దాస్ అనే పాత్రలో ఫరియా నటిస్తోంది. హఠాత్తుగా తన తండ్రి కనిపించకుండా పోవడంతో ఆయన్ను వెతుక్కుంటూ ఒడిశాలోని ‘జెంగబూరు’ గ్రామానికి వస్తుంది. అతి కొద్ది కాలంలో అక్కడ చాలా మార్పులు జరగడం ఆశ్చర్యపోతుంది. అప్పటివరకూ అడవులతో పచ్చగా ఉన్న చోట అక్రమ మైనింగ్ జరుగుతుంటుంది.
ఆ క్రమంలోనే తన తండ్రి అదృశ్యం అయ్యాడని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ. నాజర్, మకరంద్ దేశ్‌పాండే ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. క్లైమేట్ ఛేంజ్ ఫిక్షన్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్.. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా ఈనెల 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.