
అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన ముత్యాల పెద్ద నర్సయ్యకు రెండెకరాల సాగు భూమి ఉండేది. అప్పులు పెరిగిపోవడంతో కొంత భూమి అమ్మి అప్పులు తీర్చాడు. అయితే ఇంకా అప్పులు తీరక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ఉన్న భూమిలో కొంత భాగాన్ని వేరే వాళ్ల పేరు మీద తప్పుగా నమోదు చేశారని నర్సయ్య భార్య ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పింది.
మరిన్ని వార్తల కోసం..