నాగలి,ఉరితాడుతో గవర్నర్ వద్దకు రైతు

నాగలి,ఉరితాడుతో గవర్నర్ వద్దకు రైతు

న్యాయం కోసం ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. భుజాన నాగలి, చేతిలో ఉరి తాడుతో తన ఆవేదనను వెల్లబుచ్చాడు. వరంగల్ జిల్లాకు చెందిన రైతు సురేందర్ అనే వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై గవర్నర్ తమిళి సైను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. నిన్న డీజీపీని కలిసిన రైతు.. ఇయ్యాళ గవర్నర్ తో పాటు సీఎం ను కలిసేందుకు ప్రగతి భవన్ వెళ్తానని చెబుతున్నారు. బీఆర్స్ నేతల అండతో గత కొన్నేళ్లుగా తనకు చెందాల్సిన భూమిని తన తమ్ముడు అన్యాయంగా సాగు చేసుకుంటున్నారని రైతు సురేందర్ ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులను కలిసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం కోసం భుజాన నాగలితో నగరం బాట పట్టాడు. అవినీతిపరులను చట్టరిత్యా శిక్షించండి లేదంటే తనను సత్వరమే ఉరి తీయండంటూ చేతిలో తాడుతో, బ్యానర్లతో గవర్నర్ ను కలిసేందుకు పయనమయ్యాడు.