నకిలీ ఎరువులను అరికట్టాలి : రైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి

నకిలీ ఎరువులను అరికట్టాలి : రైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి

కొమురవెల్లి, వెలుగు: నకిలీ ఎరువుల దందాను అరికట్టాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి కోరారు. సోమవారం కొమురవెల్లిలోని రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటలకు పనిచేయని ఎరువుల అమ్మకాలు జరుగుతున్నా వ్యవసాయ అధికారులు పట్టించు కోవడంలేదని ఆరోపించారు. పేరున్న కంపెనీల ఎరువుల బస్తాలను దుకాణాల్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక లాభాల కోసం నాసిరకం ఎరువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వాపోయారు.

 ఈ ఎరువుల దందా చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో గతేడాది నుంచి జోరుగా సాగుతుందన్నారు. ఇంత జరుగుతున్నా  వ్యవసాయ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే నాసిరకం ఎరువు బస్తాలతో పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నకిలీ ఎరువులను అరికట్టకపోతే కలెక్టర్ ఎదటు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సంగం మండల నాయకులు సాయిలు, మల్లేశం, శ్రీనివాస్,  సురేశ్ పాల్గొన్నారు.