దేవాదుల నీటితో చెరువులు, కుంటలు నింపాలి : రైతు సంఘం నాయకులు

దేవాదుల నీటితో చెరువులు, కుంటలు నింపాలి : రైతు సంఘం నాయకులు
  • రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన

బచ్చన్నపేట, వెలుగు :  మండుతున్న ఎండల దృష్ట్యా పంటలు ఎండిపోకుండా దేవాదుల నీటితో చెరువులు, కుంటలు నింపి ఆదుకోవాలని సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం మొండికుంట స్టేజీ వద్ద జనగామ–సిద్దిపేట ప్రధాన రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులవల్ల భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు నీళ్లు పోయక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దేవాదుల నీటితో చెరువులు, కుంటలు నింపి పంటలను కాపాడాలని కోరారు.

అర్హులైన రైతులందరికీ రైతుబంధు జమచేయాలని, రెండు లక్షల పంటరుణం మాఫీ చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు కొత్తపల్లి బాల్​నర్సయ్య, రామగళ్ల అశోక్​, బుర్రి సుధాకర్, అన్నెబోయిన శ్రీనువాసు, రాజు, మనోహర్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, భాను, నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.