
జైనూర్, వెలుగు: వివిధ బ్యాంకులు అందిస్తున్న జీవిత బీమా పథకాలపై జైనూర్ మండలం మార్లవాయిలో బ్యాంకు అధికారులు బుధవారం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంకు ఫీల్డ్ లెవెల్ కోఆర్డినేటర్ లోకరాంరెడ్డి, బ్యాంకు మేనేజర్ టి.రాజేశ్వర్ మాట్లాడుతూ.. బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ బీమా పథకాల ద్వారా లాభం పొందాలని సూచించారు.
బీమా ప్రీమియంను తప్పనిసరిగా ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల ద్వారా మాత్రమే చెల్లించాలని కోరారు. జనసురక్ష, పీఎం జేజేవై, పీఎం జన్‌ధన్ యోజన వంటి పథకాలు వయోపరిమితి ఆధారంగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ సెక్రటరీ ప్రకాశ్, జీపీ సెక్రటరీ మనోజ్ కుమార్, మాజీ సర్పంచ్ ప్రతిభ, గ్రామ పటేల్ ఆత్రం హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.