రైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన

రైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన

రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న ఏ ఒక్కరికి రైతు రుణమాఫీ చేయలేదని.. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని షాద్ నగర్ పట్టణంలో పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. రైతు రుణమాఫీ కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు.