టమాటాకిలో రూ.3.. రోడ్డు పక్కన పారబోసిన రైతులు

టమాటాకిలో రూ.3..  రోడ్డు పక్కన పారబోసిన రైతులు

కర్నూల్: ఆగస్టులో ఆల్‌‌టైమ్ రికార్డుతో మోత మోగించిన టమాటా ధరలు.. ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. గత నెలలో కిలో రూ.200పైగా ధరతో రైతులకు సిరుల వర్షం కురిపించగా.. ఇప్పుడు రూ.10 కన్నా తక్కువకు పడిపోయి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. 

దీంతో గిట్టుబాటు కాక రైతులు తమ పంటను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. గురువారం ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌‌లో ధరలు లేకపోవడంతో రైతులు టమాటా పంటను అక్కడే పారబోసి వెళ్లిపోయారు. టమాట రాశుల వద్ద పశువులు మేస్తూ కనిపించాయి. 

ధరలు భారీగా పడిపోయాయని, కనీసం కోత, రవాణా ఖర్చులు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కిలో టమాటా ధర రూ.3కి తగ్గిపోయిందని వాపోయారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌‌లోనూ టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి.