
హాలియా, వెలుగు: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా మిర్యాలగూడ–హాలియా ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్కారు సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా... 12 గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. ఇందులోనూ కోతలు పెడుతోందని, 24 గంటల కరెంట్ పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.