మా భూములివ్వమంటూ మర్లవడ్డ రైతులు

మా భూములివ్వమంటూ మర్లవడ్డ రైతులు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ర్యాలీగా తరలివెళ్లారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ చర్చి వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మాస్టర్ ప్లాన్ నిర్ణయంతో నిన్న రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు ఆత్మహత్యతో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉపసర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పిఏసీఎస్ డైరెక్టర్, ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు రాజీనామా చేశారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.