చిన్నరాస్పల్లిలో యూరియా లారీని ఆపిన రైతులు..గ్రామంలోనే పంపిణీ చేయాలని డిమాండ్

చిన్నరాస్పల్లిలో యూరియా లారీని ఆపిన రైతులు..గ్రామంలోనే పంపిణీ చేయాలని డిమాండ్

దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లి గ్రామస్తులు యూరియా లోడుతో గిరవెల్లి వెళ్తున్న లారీని అడ్డుకున్నారు. తమ ఊరిలోనే యూరియా పంపిణీ చేయాలని లారీ ముందు బైఠాయించారు.

 విషయం తెలుసుకున్న ఏవో రామకృష్ణ, కాగజ్ నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, డీటీ గణేశ్ గ్రామానికి చేరుకొని గిరవెల్లి రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తామని చెప్పినా వినలేదు. ఆందోళన చేయడంతో అక్కడే టోకెన్లు రాసి రైతులకు ఇచ్చారు. గిరవెల్లి రైతు వేదికలో యూరియా తీసుకోవాలని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించి లారీని వదిలిపెట్టారు.