సీడ్ పత్తి చేలను దున్నేస్తున్రు

సీడ్  పత్తి చేలను దున్నేస్తున్రు

ఎర్ర తెగులు సోకడంతో పాటు ఎండ తీవ్రతతో సీడ్ పత్తి పంట ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు వందలాది ఎకరాలను దున్నేస్తున్నారు. మరికొందరు రైతులు చేలల్లో గొర్రెలను మేపుకునేందుకు ఇచ్చేస్తున్నారు. గట్టు మండలం చిన్నోనిపల్లి విలేజ్ కి చెందిన శ్రీనివాస్​రెడ్డి తాను సాగు చేసిన రెండెకరాల సీడ్ పత్తికి ఎర్ర తెగులు సోకడంతో ట్రాక్టర్ తో దున్నేశారు. ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చయిందని వాపోయారు. అదే గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి గొర్రెల మేతకు తన సీడ్  పత్తి పంటను ఇచ్చేశాడు. ఇలా ఇప్పటికే వందలాది మంది రైతులు తమ పంటలను తీసేస్తున్నారు.

- గద్వాల, వెలుగు