
తెలివి ఎవరి సొత్తు కాదు. అది అందరిదీ. వాడుకున్నోడికి వాడుకున్నంత. ఈ వీడియోలో ఓ రైతు కూడా తన తెలివిని ఉపయోగించాడు. పొడవాటి కొబ్బరి చెట్లను చకచకా ఎక్కేందుకు ఓ మెషీన్ ను తయారుచేయించాడు. తాటిచెట్లను ఎక్కేందుకు మెషీన్లు వాడుతున్న సంగతి అక్కడక్కడా చూసేఉంటారు. అలాంటిదే ఇది కూడా. కానీ.. అతడు ఆ వెహికిల్ పైకి వెళ్తుంటే మన కళ్లను మనమే నమ్మలేం.
రేస్ పెంచింతే.. చెట్టుపైపైకి వెహికల్ వెళ్తుంది. బ్రేకులేస్తూ.. కొంచెంకొంచెంగా కిందకు దిగొచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ రేసింగ్ అంటే ఇష్టపడేవాళ్లు రైతుగా మారితే.. పరిస్థితి ఇలాగే ఉంటుందనే కామెంట్ తో వీడియోను పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. పోస్ట్ అయినప్పటినుంచీ.. ఈ వీడియో తెగ తిరుగుతోంది.
అప్పట్లో మరో వీడియో ఆన్ లైన్ లో బాగా తిరిగింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా… పొడవాటి కొబ్బరి చెట్లు, తాటిచెట్లను ఎక్కుతున్న వీడియో చూసేవాళ్లను అబ్బురపరిచింది. డ్రోన్ తో చిత్రీకరించిన ఆ వీడియో కూడా కింద చూడొచ్చు.
When you want to be a bike racer but become a farmer due to parental pressure. pic.twitter.com/OxkPKleoRa
— Bade Chote (@badechote) June 2, 2019