రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ సర్వేను అడ్డుకున్న రైతులు

రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ సర్వేను అడ్డుకున్న రైతులు

ఎల్కతుర్తి, వెలుగు :  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులో సోమవారం చేపట్టిన రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ పనులను రైతులు అడ్డుకున్నారు. కాజీపేట- – బల్హార్ష రూట్‌‌‌‌‌‌‌‌లో హసన్‌‌‌‌‌‌‌‌పర్తి రోడ్డు నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ వరకు కొత్త రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ కోసం 2013లోనే ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ రెడీ చేశారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇటీవల అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను మార్చి మరోసారి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ రెడీ చేశారు. ఇందులో భాగంగా దండేపల్లి గేట్‌‌‌‌‌‌‌‌ నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ వరకు భూ సేకరణ చేసేందుకు నిర్ణయించారు. 

ఇందుకోసం సాయిల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించేందుకు రైల్వే ఆఫీసర్లు సోమవారం దండేపల్లికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు భూసార పరీక్షలను అడ్డుకున్నారు. రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ కోసం తమ భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. దీంతో ఆఫీసర్లు వెనుదిరిగారు. అనంతరం రైతులు మాట్లాడుతూ 2013 మ్యాప్‌‌‌‌‌‌‌‌ ప్రకారం భూ సేకరణకు ఒప్పుకున్నామని, కానీ ఆఫీసర్లు ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తున్నారన్నారు. ఈ అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో సన్న, చిన్నకారు రైతుల భూములే ఎక్కువగా ఉన్నందున దండేపల్లి రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ కోసం భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. రైతులు నాయినేని మదన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌రావు, జూపాక శ్రీనివాస్, స్వామినాథన్, బోయినపల్లి దేవేందర్‌‌‌‌‌‌‌‌రావు, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, సంపత్, వెంకన్న, కమలాకర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.