ఢిల్లీ రోడ్లన్నీ బ్లాక్.. శింభూలో రైతులపైకి టియర్ గ్యాస్

ఢిల్లీ రోడ్లన్నీ బ్లాక్.. శింభూలో రైతులపైకి టియర్ గ్యాస్

కనీస మద్దతు ధర చట్టం చేయాలని, స్వామి నాధన్ కమిషన్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలనే డిమాండ్లతో 200 రైతు సంఘాలు ఛలో ఢిల్లీ పాదయాత్ర ఈ రోజు పార్లమెంట్ ముట్టడికి బయలుదేరారు. పాదయాత్రను ఆపివేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోపాటు మరొ ఇద్దురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకులతో నిన్న రాత్రి 12గంటల వరకు చంఢీఘర్ లో చర్చలు జరిపారు.

చర్చలు విఫలం కావడంతో యథావిధిగా ఛలో ఢిల్లీ నిరసన పాదయాత్ర కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మొర్చా నేతలు తెలిపారు. ఢిల్లీలో రహదారులు ఎక్కడిక్కడ బారికేట్లతో పోలీసులు భారీ బంధోబస్త్ ఏర్పాటు చేశారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీవైపుకు 1500 ట్రాక్టర్లు, 500 ఇతర వాహనాల్లో  రైతులు బయలెల్లారు. 

చిన్న చిన్న గ్రూపులుగా 6 నెలలు నిరసన

ఓ ఇంటలీజెన్సీ సంస్థ రైతులు ట్రాక్టర్లలో 6 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు తీసుకొని వస్తున్నారని, వారు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఢిల్లీ చుట్టు పక్కల షెల్టర్స్ చేసుకొని 6 నెలలు ఉండటానికి పక్కా ప్లాన్ తో వస్తున్నట్లు రిపోర్ట్ ఇచ్చింది. రైతులను ఢిల్లీలోపలికి రాకుండా చేయడానికి పోలీసులు రోడ్డు అన్ని బ్లాక్ చేశారు. ఘజిపూర్, సింఘు, టిక్రి, సిర్సా ప్రాంతాల నుంచి ఢిల్లీ వైపు వచ్చే మార్గాల్లో భారీగా బారిగేట్లు, సిమెంట్ దిమ్మలు, ట్రక్కులు, క్రేన్లు, వజ్రా వాహనాలు, ఇనుప కంచెలు, టియర్ గ్యాస్, వాటర్ కానన్ వాహనాలు సిద్ధం చేసుకున్నారు. పోలీసులు రానున్న నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ అమలు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన రైతు నిరసనలో అల్లర్లను దృష్టిలో పెట్టుకొని మరింత పకడ్బందీగా ఏర్పాటు చేశారు.

శంభూ బార్డర్ లో టియర్ గ్యాస్ ప్రయోగం

శంభూ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీని ముట్టడించడానికి వచ్చిన రైతులకు పోలీసులు వెనక్కి తిరిగి వెళ్లమని చెప్పారు. అయనా వారు వినకుండా ముందుకు వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షన జరిగి పరిస్థితి చేతులు దాటి పోయింది. వెంటనే పోలీసులు రైతులపైకి టియర్ గ్యా్స్ విసిరారు. అయినా సరై రైతులు వెనక్కి తగ్గడం లేదు, బార్కెట్లను తోసుకుంటూ ఢిల్లీవైపుకు వెళ్తున్నారు.

ALSO READ :- హెలికాప్టర్ రెడీగా ఉంది..కేసీఆర్ రావాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి..
ఢిల్లీ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్, ఢిల్లీ, యుపి స్పెషల్ పోలీసులు మొహరించారు. ఇండియా గేట్, పార్లమెంట్ వెళ్లే రూట్లను పోలీసులు పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సామాన్యులు గంట కొద్ది రోడ్లపైనే వేట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.