అయిజ మండలంలో...వర్షం కోసం రైతుల పూజలు

అయిజ మండలంలో...వర్షం కోసం రైతుల పూజలు

అయిజ ,వెలుగు : వర్షాలు కురవాలని మండలంలో రైతులు పూజలు ఆదివారం పూజలు చేశారు. పట్టణంలోని 20వ వార్డులో మహిళా రైతులు కౌన్సిలర్  హుస్సేన్ బీ ఆధ్వర్యంలో నడిమిపేట కాలనీలో పూజలు నిర్వహించారు. వరుణ దేవుడికి నైవేద్యం సమర్పించి అన్నదానం చేశారు. మహబూబ్ బాషా, పూజారి వెంకటేశ్, రామకృష్ణ, లక్ష్మన్న పాల్గొన్నారు. మండలంలోని యాపదిన్నెలో రైతులు వర్షం కోసం గ్రామ దేవతలకు పూజలు చేశారు. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి కాడెద్దులతో నదీ జలాలను గ్రామానికి తీసుకువచ్చి గ్రామంలోని ఆలయాల్లో జలాభిషేకం చేశారు. అనంతరం గ్రామంలో కాడెద్దులతో ఊరేగింపు చేసి, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లింగాల : మండల కేంద్రంలో బంజారా నాయకులు వర్షాలు కురవాలని పూజలు నిర్వహించారు. వర్షాలు సరిగా కురవక పోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడడంతో మేరామ ఆలయం వద్ద పూజలు చేశారు. చందు నాయక్, గోపి, కిషన్ నాయక్, దేవుల నాయక్, రాంజీ నాయక్, శంకర్ లాల్, సీతారాం నాయక్, దేవేందర్ నాయక్  పాల్గొన్నారు.